- కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరిన ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి అదిత
కాగజ్‌నగర్, వెలుగు: ఆసిఫాబాద్జిల్లా సిర్పూర్లోని ఎస్పీఎం పేపర్ మిల్ కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరుతూ ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి బెస్త అదిత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని కోరారు. గురువారం ఆమె హైదరాబాద్లోని మంత్రి నివాసంలో మంత్రిని కలిసి కార్మికుల సమస్యలను వివరించారు.
ఎస్పీఎం యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరితో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కార్మికుల ప్రధాన డిమాండ్ గుర్తింపు సంఘం ఎన్నికలు, క్యాంటీన్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎస్పీఎం కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారని అదిత పేర్కొన్నారు.
