సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్న రత్నదీప్ రిటైల్ లిమిటెడ్ ఫండ్స్ సేకరించేందుకు సెబీ వద్ద ఐపీఓ పేపర్లను సబ్మిట్ చేసింది. ఈ ఇష్యూలో రూ. 400 కోట్ల విలువైన ఫ్రెష్ షేర్లను జారీ చేయనుంది. దీంతో పాటు ప్రమోటర్లు దాదాపు 1.49 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద అమ్మనున్నారు. సేకరించిన నిధులలో రూ. 260 కోట్లను కొత్త స్టోర్ల ఏర్పాటుకు, రూ. 40 కోట్లను అప్పుల చెల్లింపునకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగించనున్నారు.
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేసే రత్నదీప్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీ 190 స్టోర్లను నడుపుతోంది. ఇందులో సూపర్ మార్కెట్లు (రత్నదీప్ మైండ్‌ఫుల్ లివింగ్/సెలెక్ట్), హైపర్‌మార్కెట్ (నేషనల్ మార్ట్) ఉన్నాయి.
ఆర్థిక సంవత్సరం 2025-–26 లో కంపెనీ రూ. 2,223 కోట్ల ఆపరేటింగ్ రెవెన్యూపై రూ. 37 కోట్ల నికర లాభాన్ని సాధించింది. మార్కెట్లో దీనికి అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డిమార్ట్), విశాల్ మెగా మార్ట్, స్పెన్సర్స్ రిటైల్, ట్రెంట్ వంటి లిస్టెడ్ కంపెనీలతో పోటీ ఉంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ, జియో ఇప్పటికే ఐపీఓ పేపర్లను ఫైల్ చేశాయి.
