కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాళ్ల పర్వంతో వరంగల్ లో రాజకీయం వేడెక్కింది. కూడా భూముల వేలంపై ఇరు పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళు కొనసాగుతున్నాయి. శుక్రవారం ( జులై 3 ) వరంగల్ లోని భద్రకాళి ఆలయానికి చేరింది భూముల పంచాయితీ. తడి బట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి పరస్పర సవాళ్లు విసురుకున్నారు.
కొద్ది రోజులుగా సాగుతున్న సవాళ్ల పర్వం ఇవాళ భద్రకాళి ఆలయానికి చేరుకుంది. తడిబట్టలతో భద్రకాళి అమ్మవారి వద్దకు చేరుకున్నారు మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి. ఈ క్రమంలో ఆయన అనుచరులు భారీగా ఆలయం దగ్గరికి చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. యాదవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు
ALSO READ : సూర్యాపేటలో పోలీసుల తనిఖీలు ...70 వాహనాలు సీజ్
ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది . భూముల వేలంలో కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. భద్రకాళి అమ్మవారి సాక్షిగా నిరూపించాలని సవాల్ విసిరారు యాదవ రెడ్డి.
