సూర్యాపేటలో పోలీసులు విస్తృత తనిఖీ లు నిర్వహించారు. రాత్రి ( జూన్ 2)న రాత్రి 10 నుంచి 12 గంటలకు నాఖా బందీ నిర్వహించారు. పట్టణంలో 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు 100 మంది పోలీసులు పాల్గొన్నారు.
బైక్ లు.. కార్లు ... ఇతర వాహనాల పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా పత్రాల తనిఖీ చేవారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు.. వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచిన అధికారులు 70 వాహనాలను సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, చోరీ వాహనాల గుర్తించేందుకు నాఖాబందీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ALSO READ : యాదగిరిగుట్ట – పోచంపల్లి వన్ డే టూర్ ప్యాకేజీ..
అక్రమ రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించి.. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ సూచించారు. వాహనానికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్ వెంట ఉంచుకోవాలని వాహనదారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన ఉద్దేశమని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. సురక్షిత సమాజ నిర్మాణానికి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
