Chingari Song: అశోక్ గల్లా–శ్రీ గౌరీ జోడీపై ఫీల్ గుడ్ సాంగ్… సిద్ శ్రీరామ్ వాయిస్‌తో మ్యాజిక్

Chingari Song: అశోక్ గల్లా–శ్రీ గౌరీ జోడీపై ఫీల్ గుడ్ సాంగ్… సిద్ శ్రీరామ్ వాయిస్‌తో మ్యాజిక్

అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా కొత్త దర్శకుడు ఉద్భవ్ రఘు రూపొందిస్తున్న చిత్రం 'విసా : వింటారా సరదాగా'. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. లేటెస్ట్గా ఈ చిత్రం నుంచి రెండో పాటను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసిన పాటకు సనారే లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ పాడిన తీరు ఆకట్టుకుంది.

'నువ్వొచ్చాకే మైకంలో మనసంత తేలిందే.. నువ్వొచ్చాకే ప్రాయంలోమహత్తేంటో తెలిసిందే.. నువ్వొచ్చాకే నా పయనంలో ప్రతి మలుపు మెరిసిందే.. నువ్వొ చ్చాకే నా ప్రాణంలో మరో సగము మురిసిందే.. చెలియా నువునా తోడుంటే లోకాన్నేగెలిచేస్తానే.. చింగారి.. నా చిరు నవ్వుల ఓ సింగారి.. బాగుందే నువ్వువచ్చాక..' అంటూ సాగిన పాటలో అశోక్ గల్లా, శ్రీ గౌరీప్రియా జోడీ స్టెలిష్ గా కనిపిస్తూ ఇంప్రెస్ చేసింది.

ALSO READ : Rao Bahadur Review: ‘రావు బహదూర్’ రివ్యూ.. మహేష్ బాబు నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?

ఫారిన్ బ్యాక్ డ్రాప్లో చిత్రీకరించిన విజువల్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.