అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ (Lenin). హీరో నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను మురళీకిశోర్ అబ్బూరు గ్రాండ్ గా తెరకెక్కించారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా జూలై 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా ఉండనున్నాయని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి అఖిల్ లెనిన్ మూవీ ప్రమోషన్లలో బిజీ బిజిగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమంత నటనపై అఖిల్ ప్రశంసలు కురిపించారు
సమంత యాక్షన్కు అఖిల్ ఫిదా..
‘లెనిన్’ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా.. బిగ్ సక్సెస్ అవుతుందని. సినిమా వైబ్, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ టచ్ తనకు బాగా నచ్చిందని అఖిల్ తెలిపారు. ఫీమేల్ లీడ్‌తో ఇలాంటి యాక్షన్ ఎంటర్‌టైనర్ తీయడం చాలా ప్రత్యేకమని, సమంత అద్భుతంగా నటించిందని అఖిల్ ప్రశంసించారు.
ALSO READ : అశోక్ గల్లా–శ్రీ గౌరీ జోడీపై ఫీల్ గుడ్ సాంగ్… సిద్ శ్రీరామ్ వాయిస్‌తో మ్యాజిక్
ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్‌లో నటీనటుల మధ్య ఉండే ప్రొఫెషనల్ బాండింగ్ మరోసారి హైలైట్ అయింది. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఇద్దరికీ అభినందనలు తెలుపుతున్నారు.
#AkhilAkkineni about Samantha’s #MaaIntiBangaram ❤️#Lenin #Samantha pic.twitter.com/k1z3Rj1F6A
— Telugu Cineverse (@TeluguCineverse) July 2, 2026
‘మా ఇంటి బంగారం’ కలెక్షన్స్..
సమంత లీడ్ రోల్లో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సినిమా 13 రోజుల్లో దాదాపు రూ.82 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు (వరల్డ్ వైడ్) సాధించింది. కేవలం నైజాం, ఆంధ్రా ప్రాంతాల్లోనే కాక ఓవర్సీస్‌లోనూ మంచి రికార్డులు సృష్టిస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. వీడియో వైరల్ అవ్వడంతో 'లెనిన్' తో అఖిల్ బ్లాక్ బస్టర్ అందుకోవాలని సామ్ ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.
