హైదరాబాద్, వెలుగు: స్పేస్‌టెక్ స్టార్టప్స్కైరూట్తయారు చేసిన భారతదేశపు మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్– 1 ప్రయోగానికి సిద్ధమైంది. మిషన్ ఆగమన పేరుతో ఈ ప్రయోగం జులై 12 నుంచి ఆగస్టు 4 మధ్య జరగనుంది. ఏపీ నగరం నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు.
ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యం విక్రమ్– 1 ప్రదర్శనను , సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించడం. దీనిద్వారా సేకరించే డేటా భవిష్యత్తులో వాణిజ్యపరమైన రాకెట్ ప్రయోగాలకు పునాదిగా మారుతుంది. 350 కిలోల బరువు గల చిన్న ఉపగ్రహాలను భూమికి దగ్గరి కక్ష్యలోకి తీసుకెళ్లేలా రాకెట్‌ను రూపొందించారు. 3డీ ప్రింటెడ్ ఇంజన్లు , కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో తయారు చేశారు.
