న్యూఢిల్లీ: ఐనాక్స్ జీఎఫ్ఎల్ గ్రూప్ అనుబంధ సంస్థ ఇనాక్స్ క్లీన్ ఎనర్జీలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ సీఈఓ అదర్ పూనావాలా ఫ్యామిలీ ఆఫీస్ రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టింది. రైజింగ్ సన్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఇన్వెస్ట్ చేసింది. దీంతో ఇనాక్స్ క్లీన్ ఎనర్జీ మార్కెట్ విలువ రూ. 70వేల కోట్లకు చేరింది.
ఈ నిధులను సంస్థ తన బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడానికి, కొత్త క్లీన్ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టడానికి , సోలార్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగించనుంది. గత 10 నెలల్లోనే ఈ సంస్థ 10 కీలకమైన కొనుగోళ్లను పూర్తి చేసి తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించింది. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి 15 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి , 11 గిగావాట్ల సోలార్ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.
