Pinaka Release: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మిస్టికల్ థ్రిల్లర్..‘పినాక’ రిలీజ్ డేట్ అనౌన్స్

Pinaka Release: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మిస్టికల్ థ్రిల్లర్..‘పినాక’ రిలీజ్ డేట్ అనౌన్స్

కన్నడ నటుడు గణేష్ హీరోగా తెరకెక్కుతున్న అడ్వెంచర్ మూవీ 'పినాక'. బి. ధనంజయ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. గురువారం గణేష్ పుట్టినరోజు సంవత్వంగా స్పెషల్ పోస్టర్ తో పాటు ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ పోస్టర్ లో పురాతన రహస్యాన్ని తీక్షణంగా పరిశీలిస్తూ కనిపిస్తున్నారు గణేష్ అక్టోబర్ 20 గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయునున్నట్లు ప్రకటించారు. అడ్వెంచర్, పురాణాలు, రహస్యాలు, అద్భుతాల కలలుండగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోందీ. గౌర హరి సంగీతం అందిస్తున్నాడు.