అంత కష్టం ఏమొచ్చిందీ : ఈ భార్యా భర్తలు ఒక్కటిగా రైలు కింద పడ్డారు..!

అంత కష్టం ఏమొచ్చిందీ : ఈ భార్యా భర్తలు ఒక్కటిగా రైలు కింద పడ్డారు..!

ఘట్ కేసర్ లో ఘోరం జరిగింది. భార్యాభర్తలు ఒక్కటిగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ( జులై 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఘట్ కేసర్ సమీపంలో దంపతులు ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మృతులు వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు.

ఈ ఘటనపై స్థానికులు అందించిన సమాచారంతో ఘటాస్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిస్థితిని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టంకోసం తరలించారు. చూడముచ్చటగా ఉన్న దంపతులకు అంత కష్టం ఏమొచ్చిందో పాపం... అంటూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. మృతుల వివరాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, లేక అనారోగ్య కారణాలు ఆత్మహత్యకు దారి తీశాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తునంట్లు తెలిపారు పోలీసులు.