న్యూఢిల్లీ: ఏఐ టెక్నాలజీలను ఎంచుకోవడంలో వ్యాపార సంస్థలకు సహాయపడేందుకు మైక్రోసాఫ్ట్ ఫ్రాంటియర్ కంపెనీ పేరుతో కొత్త సంస్థను ప్రారంభించింది. ఈ కొత్త సంస్థ కోసం 2.5 బిలియన్డాలర్లు (దాదాపు రూ. 23,806 కోట్లు) కేటాయించింది. ప్రస్తుతం పెద్ద సంస్థలు ఒకే ప్రొవైడర్ పై ఆధారపడకుండా విభిన్న ఏఐ టెక్నాలజీలను వాడుతున్నాయి. వీటితో అయ్యే ఖర్చు , సమయాన్ని ఆదా చేసేందుకు ఈ సంస్థ ఉపయోగపడుతుంది.
యూనిలీవర్ , నోవో నార్డిస్క్ వంటి క్లయింట్లకు ఫ్రాంటియర్ సేవలు అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ , ఇతర కంపెనీల ఏఐ టూల్స్ ను అంతర్గత డేటాతో అనుసంధానం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే చేసిన పని ఫలితాలను కస్టమర్లు తమ వద్దే ఉంచుకోవచ్చని కంపెనీ తెలిపింది.
