తయారీలో ఏఐ కీలకం..పెద్ద పరిశ్రమల్లోనే కాదు..  ఎంఎస్‌‌ఎంఈలకు ఏఐను విస్తరించాలి

తయారీలో ఏఐ కీలకం..పెద్ద పరిశ్రమల్లోనే కాదు..  ఎంఎస్‌‌ఎంఈలకు ఏఐను విస్తరించాలి
  • ఫిక్కీ సదస్సులో నిపుణులు

హైదరాబాద్, సిటీ, వెలుగు: ఇండియాను  ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఏఐ కీలక పాత్ర పోషించనుందని పరిశ్రమల ప్రముఖులు, టెక్నికల్​ఎక్స్‌‌పర్ట్స్​అభిప్రాయపడ్డారు. ఫిక్కీ తెలంగాణ  గురువారం నిర్వహించిన  ఓ సదస్సులో  ఏఐ ప్రాముఖ్యతను గురించి  చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి మాట్లాడుతూ,  చైనా, తైవాన్‌‌లోని ఇండస్ట్రీస్‌‌ ఏఐతో సమర్థవంతంగా మ్యాన్యుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయన్నారు. 

మన దేశంలో ఏఐ వినియోగం స్పీడప్​కావాల్సిన అవసరం, ఎంఎస్‌‌ఎంఈల డెవలప్‌‌ మెంట్‌‌కు సంబంధించిన విధానాల్లో ఏఐని వినియోగించేలా తెలంగాణ సర్కార్ ప్రపంచ స్థాయి ఎక్స్‌‌పర్ట్స్‌‌తో కలిసి పనిచేస్తోందని వివరించారు.  ‘‘ భారత తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. 

డిజిటల్ ప్రపంచంలో పోటీతత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి సంస్థ ఏఐని తప్పనిసరిగా స్వీకరించాల్సిన అవసరం ఉంది”అనిఫిక్కీ తెలంగాణ రాష్ట్ర మండలి చైర్మన్ వీవీ రామరాజు పేర్కొన్నారు. అపోలో టైర్స్ లిమిటెడ్ గ్లోబల్ హెడ్ హర్షవర్ధన్ మాట్లాడుతూ..  ఏఐ మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం కాదని, దాన్ని మరింత సమర్థవంతం చేసే సాధనమని పేర్కొన్నారు.