న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్లోబల్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్‌రాక్‌ల జాయింట్ వెంచర్ కంపెనీ జియో బ్లాక్‌రాక్, రాబోయే మూడేళ్లలో అన్ని రకాల మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే మరిన్ని స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (ఎస్‌ఐఎఫ్‌లు), ఎక్స్ఛేంజ్- ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), గిఫ్ట్ సిటీ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడి ఉత్పత్తులను ప్రారంభించనుంది.
కంపెనీ తన మొదటి ఎస్ఐఎఫ్ అయిన 'ప్రిజమ్ హైబ్రిడ్ లాంగ్-షార్ట్ ఫండ్'ను తాజాగా ప్రవేశపెట్టింది. 2శాతం తక్కువ రిస్క్‌తో 9-–11శాతం వార్షిక రాబడిని అందించేలా దీనిని రూపొందించామని కంపెనీ చెబుతోంది. దీని కనీస పెట్టుబడి రూ. 10 లక్షలు. ఎఫ్‌డీల కంటే మెరుగైన రాబడిని ఆశించే వారికి ఇది ప్రత్యామ్నాయం. వచ్చే ఏడాదిలో ఈక్విటీ లాంగ్-షార్ట్ కేటగిరీలో మరో ఎస్‌ఐఎఫ్‌ని కూడా తీసుకొస్తామని జియో బ్లాక్‌రాక్ పేర్కొంది.
