ఇండస్ట్రియల్ పార్క్ ను అడ్డుకునేందుకు కుట్ర..బీఆర్ఎస్ నాయకులది అసత్య ప్రచారం

ఇండస్ట్రియల్ పార్క్ ను అడ్డుకునేందుకు కుట్ర..బీఆర్ఎస్ నాయకులది అసత్య ప్రచారం
  •     ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, వెలుగు :  బీఆర్ ఎస్ నాయకులు తనను రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఆదిలాబాద్ లోని తన క్యాంప్ ఆఫీస్ లో గురువారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన జోగు రామన్న ఆదిలాబాద్ అభివృద్ధికి ఏనాడు కృషి చేయలేదన్నారు. 

ఆదిలాబాద్‌‌లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటును జోగు రామన్న వ్యతిరేకిస్తున్నారని, అందుకే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల తనకు వ్యక్తిగత లాభం ఉంటే.. అక్కడ ఉన్న భూమిని ఎందుకు అమ్మేస్తానని ప్రశ్నించారు. వెనుకబడిన ఆదిలాబాద్ అభివృద్ధి కోసం తాను అసెంబ్లీలో నిరంతరం గొంతు వినిపిస్తున్నానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ముఖ్యమంత్రితో చర్చించి నిధులు, అభివృద్ధి ప్రాజెక్ట్ లు తీసుకొస్తుంటే కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

అసత్య ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. సమావేజోగు రవి, రాందాస్, రఘుపతి, దయాకర్, దినేశ్​ మాటోలియా, గంగాధర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.