వికారాబాద్ లోని స్కానింగ్, మందులు, డెలివరీ ఫ్రీ

 వికారాబాద్ లోని స్కానింగ్, మందులు, డెలివరీ ఫ్రీ

వికారాబాద్, వెలుగు : వికారాబాద్ లోని మహావీర్ ఇన్​స్టిట్యూట్​ఆఫ్ మెడికల్​సైన్సెస్ అండ్​జనరల్ హాస్పిటల్ లో గర్భిణులకు ఉచితంగా స్కానింగ్, డెలివరీ(సిజేరియన్, నార్మల్​డెలివరీ) చేయడంతోపాటు మందులు ఇస్తున్నట్లు సంస్థ డీన్ డాక్టర్ ఖలీల్ తెలిపారు. గురువారం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్​ భక్తవత్సలం, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్​మోహన్​కుమార్, డాక్టర్​ సంగమేశ్వర్​తో కలిసి మాట్లాడారు. 

అలాగే, బిడ్డ పుట్టాక తల్లిదండ్రులకు రూ.2,500  ఇస్తామన్నారు. కు.ని ఆపరేషన్ రూ.2 వేలకు, కంటి శుక్ల ఆపరేషన్​ను రూ.500కే చేస్తున్నామని చెప్పారు. అల్ట్రాసౌండ్, ఎక్స్​రే, సాధారణ రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.