ములుగు, వెలుగు : ములుగు జిల్లా కోర్టులో అరుదైన కేసులో తీర్పు వచ్చింది. ములుగుకు చెందిన మోతె ఉదయ్‌కుమార్ అలియాస్ ఉదయ్‌రెడ్డి యాక్సిడెంట్ లో కాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన క్లైయిమ్కోసం ఇఫ్కో టోక్కో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీపై 2021లో దావా వేశాడు. రూ.3.23 కోట్లు క్లయిమ్ కోసం కేసు వేయగా.. జిల్లా జడ్జి ఎస్‌వీపీ సూర్య చంద్రకళ లోక్ అదాలత్‌లో ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చారు. రూ.2.55 కోట్లు చెల్లించాలని బీమా కంపెనీని గురువారం తుది తీర్పు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను జడ్జి సమక్షంలో బాధితునికి అప్పగించారు.
