వనపర్తి జిల్లాలో ఈసీ పర్యటన.. శ్రీరంగనాథుడిని దర్శించుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్

వనపర్తి జిల్లాలో ఈసీ పర్యటన.. శ్రీరంగనాథుడిని దర్శించుకున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్

పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలకేంద్రంలో కొలువై ఉన్న శ్రీరంగనాథుడిని గురువారం స్టేట్​ ఎలక్షన్​ కమిషనర్​ రాణి కుముదిని దంపతులు దర్శించుకున్నారు. కలెక్టర్​ ఆదర్శ్​ సురభి, అడిషనల్​ కలెక్టర్​ వినోద్​ కుమార్​వారికి స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రసిద్ధ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాయక స్వామికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వాదంతోపాటు తీర్థ, ప్రసాదాలను అందించారు. ఆలయంలోని మ్యూజియంను సందర్శించి అక్కడ ప్రదర్శించిన చారిత్రక చిత్రాలు, కళాఖండాలను ఆసక్తిగా పరిశీలించి ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, స్థానిక సర్పంచ్ మద్దిలేటి పాల్గొన్నారు.