గుడిసెవాసులకే ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత... నిర్మాణ పురోగతిపై వనపర్తి కలెక్టర్ సమీక్ష

గుడిసెవాసులకే ఇందిరమ్మ ఇండ్లలో ప్రాధాన్యత... నిర్మాణ పురోగతిపై వనపర్తి కలెక్టర్ సమీక్ష

వనపర్తి, వెలుగు : గుడిసెల్లో నివసించే వారికే ప్రథమ ప్రాధాన్యతగా కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తకోట ఎంపీడీఓ ఆఫీసులో కొత్తకోట, మదనాపూర్ మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభం కాని కొత్తకోటలోని 58 ఇండ్లను, మదనాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 28 ఇండ్లను తక్షణమే గ్రౌండింగ్ చేయించి పనులు ప్రారంభించేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులపై ఆధారపడకుండా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు పొందేలా చొరవ చూపాలని సూచించారు. కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి అర్హులను వేగంగా గుర్తించి తమ లాగిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపాలని ఆదేశించారు. రైతులు సన్న రకం వరి ధాన్యం మాత్రమే పండించేలా అధికారులు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలని సూచించారు.