న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ(ఎస్‌సీఎల్‌ఎస్‌సీ) నూతన చైర్‌పర్సన్‌గా జస్టిస్ బీవీ నాగరత్నను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. ఈ నియామకం జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న జస్టిస్ జె.కె. మహేశ్వరి జూన్ 28న పదవీ విరమణ చేశారు.
ఆయన స్థానంలో జస్టిస్ నాగరత్న బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో రెండో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ నాగరత్న.. 2027 సెప్టెంబర్‌లో భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
