యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వాట్సాప్ క్లారిటీ...ఫేక్ అకౌంట్లకు చెక్ పెట్టేలా భద్రతా చర్యలు

యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వాట్సాప్ క్లారిటీ...ఫేక్ అకౌంట్లకు చెక్ పెట్టేలా భద్రతా చర్యలు
  • నచ్చినప్పుడు మార్చుకునే చాన్స్  
  • కేంద్రం నోటీసులు, యూజర్ల ఆందోళనల నేపథ్యంలో వివరణ 

న్యూఢిల్లీ: మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త యూజర్ నేమ్ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయా అంశాలపై ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలను వివరిస్తూ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏక్యూలను విడుదల చేసింది. ఈ ఏడాది చివరలో ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అధికారికంగా లాంచ్ చేయనుండగా, యూజర్ల ఫీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్ ఆధారంగా అన్ని భద్రతా ప్రమాణాలను పక్కాగా అమలు చేస్తామని మెటా వెల్లడించింది. కొత్త ఫీచర్ ప్రకారం.. యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ ద్వారానే ఇతరులతో  సురక్షితంగా చాట్ చేయవచ్చు. దీని వల్ల ముఖ్యంగా  వాట్సాప్ గ్రూపుల్లో  ఫోన్ నంబర్ ఇతరులకు కనిపించదు.

కాబట్టి పూర్తి ప్రైవసీ ఉంటుందని మెటా పేర్కొంది. ఈ యూజర్ నేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3 నుంచి 35 క్యారెక్టర్లను అనుమతిస్తారు. ఫోన్ నంబర్ దాచకూడదనుకునేవారు ప్రస్తుత విధానంలోనే వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ వల్ల నకిలీ అకౌంట్స్, మోసాలు పెరిగే అవకాశం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఈ ఫీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రోల్ అవుట్ చేయవద్దని మెటాకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యూజర్ల నుంచి తలెత్తే వివిధ ప్రశ్నలకు వాట్సాప్ సమాధానాలిచ్చింది.     

ప్రశ్న: యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ తప్పనిసరా? 

జవాబు: కాదు. ఇది పూర్తిగా యూజర్లకు ఆప్షనల్ మాత్రమే.

నచ్చిన యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ అందుబాటులో లేకపోతే ఏం చేయాలి?

మీకు నచ్చిన యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ అందుబాటులో ఉండకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ నేమ్ ఇప్పటికే  మీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ ఖాతాకు ఉండి ఉండవచ్చు. అవి ఆయా అకౌంట్స్ కోసమే రిజర్వ్ చేశాం. సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, మెటా-వెరిఫైడ్ ఖాతాల పేర్లను వాట్సాప్ ముందే రిజర్వ్ చేసి ఉంచింది. వాటిని సాధారణ యూజర్లు క్లెయిమ్ చేయలేరు. ఒకవేళ సాధారణ పేరును ఇప్పటికే ఎవరైనా తీసుకుని ఉంటే, యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ జనరేటర్ సాయంతో వేరే పేరును ఎంచుకోవచ్చు.

యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎవరైనా గెస్ చేసి మెసేజ్ చేసే అవకాశం ఉందా?

వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫోన్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నేరుగా సెర్చ్ చేయలేనట్టే, యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా సెర్చ్ చేయడం సాధ్యపడదు. గుర్తుతెలియని వ్యక్తులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా ఉండాలంటే, యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేమ్ కీని సెట్ చేసుకోవడం ఉత్తమ మార్గం. అలాగే వాట్సాప్ కోసం ఒక యూనిక్ పేరును ఎంచుకోవాలి. అపరిచిత నంబర్ల వివరాలు, గ్రూప్ లింకులు, దేశం వంటి వివరాల హెచ్చరికలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి. ఎవరినైనా బ్లాక్ లేదా రిపోర్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.

మెటాలోని ఇతర అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు (ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్) లింక్ చేయాలా?

మీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్ ఐడీ పేరునే వాట్సాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా పొందాలనుకుంటే, ఆ ఖాతాలను లింక్ చేయాల్సి ఉంటుంది. ఇది నకిలీ ఖాతాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఆ పేరు ఖరారైన తర్వాత, కావాలనుకుంటే ఆ ఖాతాలను అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లింక్ చేసుకోవచ్చు లేదా వేరే పేరును ఎంచుకోవచ్చు.

యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భవిష్యత్తులో మార్చుకోవచ్చా?

కచ్చితంగా మార్చుకోవచ్చు. అయితే, మీరు కోరుకునే కొత్త పేరు వేరొకరు తీసుకోకుండా అందుబాటులో ఉండాలి.

నకిలీ యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడితే ఎలా అడ్డుకుంటారు?

ప్రస్తుతానికి యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ ద్వారా మెసేజ్ పంపుకునే వీలు ఇంకా కల్పించలేదు. భవిష్యత్తులో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక, ఎవరైనా కొత్త వ్యక్తి మీకు మెసేజ్ చేస్తే.. వారు ఏ దేశానికి చెందినవారో తెలియజేయడంతో పాటు, మొదటిసారి మెసేజ్ వస్తున్నట్టు మీకు వార్నింగ్ ఇస్తాం. అలాగే, ప్రముఖుల పేర్లను ముందే బ్లాక్ చేసి ఉంచడం వల్ల నకిలీల ముప్పు తగ్గుతుంది. అనుమానాస్పద ఖాతాలపై వచ్చే బ్లాక్, రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిరంతరం పర్యవేక్షిస్తూ మోసగాళ్లపై చర్యలు తీసుకుంటాం.

యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేమ్ కీ అంటే ఏమిటి?

ఇది మీ ఖాతాకు అదనపు రక్షణ కల్పించే ఒక సీక్రెట్ కోడ్ లాంటిది. ఇతరులు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఈ యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నేమ్ కీ కూడా వారికి తెలిసి ఉండాలి. కొత్తవారి నుండి వచ్చే మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆపడానికి ఈ కీని మీరు ఎప్పుడైనా రీసెట్ చేసుకోవచ్చు.