కాంగ్రెస్ ప్రజాపాలనలోనే పేదల సొంతింటి కల సాకారం.. గతంలో బీఆర్ఎస్ హామీలు మాటలకే పరిమితం

కాంగ్రెస్ ప్రజాపాలనలోనే పేదల సొంతింటి కల సాకారం.. గతంలో బీఆర్ఎస్ హామీలు మాటలకే పరిమితం
  •     ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు:  గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో సొంతింటి హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలనలోనే పేదల సొంతింటి కల సాకారమవుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 

గురువారం మహబూబ్ నగర్ నగరం, ఎదిర డివిజన్​లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మహబూబ్ నగర్ నగరపాలక పరిధిలోని బోయపల్లి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యాం సుందర్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది కార్యకర్తలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి   పాల్గొన్నారు