SIR ఫారాలను ఓటర్లకే అందజేయాలి.. పకడ్భందీగా ఓటర్ల సవరణ కార్యక్రమం

SIR ఫారాలను ఓటర్లకే అందజేయాలి.. పకడ్భందీగా ఓటర్ల సవరణ కార్యక్రమం
  •     నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ టౌన్/ కల్వకుర్తి, వెలుగు : నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలు ఎన్యూమరేషన్ ఫారాలను నేరుగా ఓటర్లకే అందజేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ పట్టణంలోని 24వ వార్డులో ఈ ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారైనా సరే జూలై 31 నాటికి సిద్ధం కానున్న ముసాయిదా ఓటరు జాబితా కోసం ఈ ఫారాలను పూర్తిగా పూరించి బీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలకు అందించి రసీదు తీసుకోవాలని సూచించారు. 

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన.. 

ఈనెల 4వ తేదీన ఉరుకొండపేట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి హెలిప్యాడ్, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రైతు వేదికలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం పర్యటనకు సంబంధించి ఏ శాఖ అధికారి అయినా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను సక్సెస్​ చేయాలని అన్నారు.