శ్రీలంక–ఎ 288/5.. కట్టడి చేస్తున్న భారత బౌలర్లు

శ్రీలంక–ఎ 288/5.. కట్టడి చేస్తున్న భారత బౌలర్లు

గాలె: ఇండియా–ఎతో గురువారం ప్రారంభమైన రెండో అనధికార టెస్ట్‌‌‌‌లో శ్రీలంక–ఎ మెరుగైన స్థితిలో నిలిచింది. కెప్టెన్‌‌‌‌ సహన్‌‌‌‌ అరాచ్చిగే (83 బ్యాటింగ్‌‌‌‌), నువానింద్‌‌‌‌ ఫెర్నాండో (44) రాణించడంతో.. తొలి ఆట ముగిసే టైమ్‌‌‌‌కు లంక తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 85 ఓవర్లలో 288/5 స్కోరు చేసింది. సహన్‌‌‌‌తో పాటు చామిక గుణశేఖరన్‌‌‌‌ (6 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నాడు. టాస్‌‌‌‌ ఓడిన లంకకు సోహన్ డి లివెరా (28)తో తొలి వికెట్‌‌‌‌కు 53 రన్స్‌‌‌‌ జోడించి పవంత్‌‌‌‌ వీరసింఘే (39) శుభారంభాన్నిచ్చాడు. రెండో వికెట్‌‌‌‌కు 35 రన్స్‌‌‌‌ జత చేసి వెనుదిరిగాడు. ఫెర్నాండో, ఆషెన్‌‌‌‌ బండరా (34)తో 85 రన్స్‌‌‌‌ జత చేసిన సహన్‌‌‌‌.. అంజలా బండార (42)తో ఐదో వికెట్‌‌‌‌కు 101 రన్స్‌‌‌‌ జత చేశాడు. సారాన్ష్‌‌‌‌ జైన్‌‌‌‌, యష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.