శ్రీలంకలో రెండు టెస్ట్‌‌‌‌లు ఆడనున్న టీమిండియా

శ్రీలంకలో రెండు టెస్ట్‌‌‌‌లు ఆడనున్న టీమిండియా

కొలంబో: టీమిండియా.. శ్రీలంక టూర్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ ఖరారైంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు గాలె, కొలంబోలో లంకతో రెండు టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ ఆడనున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. ఐసీసీ వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (డబ్ల్యూటీసీ)లో భాగంగా ఈ సిరీస్‌‌‌‌ జరగనుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో ఇండియా, లంక వరుసగా ఐదు, ఆరో ప్లేస్‌‌‌‌లో ఉన్నాయి. టీమిండియా చివరిసారిగా 2017లో టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌ కోసం లంకలో పర్యటించింది. ఆ సిరీస్‌‌‌‌ను 3–0తో క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేసింది.