కరీంనగర్‌‌‌‌ హ్యాట్రిక్‌..‌ 58 రన్స్‌‌‌‌ తేడాతో రంగారెడ్డి రైజర్స్‌‌‌‌పై గెలుపు

కరీంనగర్‌‌‌‌ హ్యాట్రిక్‌..‌ 58 రన్స్‌‌‌‌ తేడాతో రంగారెడ్డి రైజర్స్‌‌‌‌పై గెలుపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: టీజీ 20 లీగ్‌‌‌‌లో కరీంనగర్‌‌‌‌ డైమండ్స్‌‌‌‌ హ్యాట్రిక్‌‌‌‌ విజయాలను నమోదు చేసింది. బ్యాటింగ్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ రాధేశ్‌‌‌‌ (72), హెచ్‌‌‌‌కే సిమ్హా (60) రాణించడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో కరీంనగర్‌‌‌‌ 58 రన్స్‌‌‌‌ తేడాతో రంగారెడ్డి రైజర్స్‌‌‌‌పై గెలిచింది. దాంతో 6 పాయింట్లతో పట్టికలో రెండో ప్లేస్‌‌‌‌లో నిలిచింది. టాస్‌‌‌‌ ఓడిన కరీంనగర్‌‌‌‌ 20 ఓవర్లలో 230/5 స్కోరు చేసింది. తన్మయ్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (29), సాత్విక్‌‌‌‌ రెడ్డి (24) ఫర్వాలేదనిపించారు. 

తనయ్‌‌‌‌ జడ్డూ 2 వికెట్లు తీశాడు. ఛేజింగ్‌‌‌‌లో రంగారెడ్డి 20 ఓవర్లలో 172/9 స్కోరుకే పరిమితమైంది. ఆదిత్య జవ్వాజి (48) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. ఆర్యన్‌‌‌‌ కరియప్ప (30 నాటౌట్‌‌‌‌), జ్ఞాన రెడ్డి (23), ఆరోన్‌‌‌‌ జార్జ్‌‌‌‌ (19), నితిన్‌‌‌‌ సాయి యాదవ్‌‌‌‌ (15) మోస్తరుగా ఆడారు. నారాయణ తేజ 3, రత్లావత్‌‌‌‌ దినేశ్‌‌‌‌, శుభమ్‌‌‌‌ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రాహుల్‌‌‌‌ రాధేశ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.