ఇండియా యంగ్ ప్లేయర్ ఆకర్షి కశ్యప్.. కెనడా ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో బోణీ చేసింది. బుధవారం రాత్రి జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆకర్షి 21–14, 21–12తో అన్నా టాట్రనోవా (ఫ్రాన్స్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో తాన్య హేమనాథ్ 21–16, 21–18తో దిశా గుప్తాపై నెగ్గింది. దేవిక సిహాగ్ 14–21, 15–21తో తుంగ్ సియు టాంగ్ (చైనీస్‌తైపీ) చేతిలో, అన్మోల్ ఖర్బ్ 6–21, 16–24, 13–21తో మిషెల్ లీ (కెనడా) చేతిలో, రక్షిత రామరాజ్ 21–15, 14–21, 15–21తో రాచెల్ చాన్ (కెనడా) చేతిలో, శ్రీయాన్షి 9–21, 18–21తో హుయాంగ్ చింగ్ పింగ్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు. మెన్స్ సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 10–11 స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. సనీత్ దయానంద్, 7–21, 11–21తో యుడాయ్ ఒకిమోటో (జపాన్) చేతిలో, శంకర్ సుబ్రమణియన్ 21–19, 15–21, 15–21తో యు టీ బిన్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు.
