వంగూరు, వెలుగు: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డితో కలిసి ఆయన రైతులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాణ్యమైన పత్తి విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కుడుముల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
