2030 నాటికి 10 వేల చార్జింగ్ స్టేషన్లు: టాటా పవర్ ప్రకటన

2030 నాటికి 10 వేల చార్జింగ్ స్టేషన్లు: టాటా పవర్ ప్రకటన
  • నివాస ప్రాంతాల్లో 7.5 లక్షల చార్జర్లు

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్​ వెహికల్స్​ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో 2030 నాటికి దేశవ్యాప్తంగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను 10వేలకు పైగా పెంచాలని టాటా పవర్​ యోచిస్తోంది. ఇళ్లలోనూ 7.5 లక్షల చార్జర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 6,700కు పైగా చార్జింగ్ పాయింట్లను నిర్వహిస్తోంది. 

ఈవీల అమ్మకాలు అధికంగా ఉన్న మహారాష్ట్ర , దక్షిణ భారత రాష్ట్రాల్లో చార్జింగ్ స్టేషన్లను పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. వాహనాల అమ్మకాలు , వినియోగదారుల డిమాండ్‌‌‌‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎక్కడైతే చార్జింగ్ అవసరం ఎక్కువగా ఉందో అక్కడ ఈ సౌకర్యాలను కల్పించనుంది.