సెనెగల్‌‌‌‌పై బెల్జియం సూపర్‌‌‌‌ విక్టరీ.. టైల్‌‌‌‌మన్స్‌‌‌‌ డబుల్‌‌‌‌ గోల్‌‌‌‌

సెనెగల్‌‌‌‌పై బెల్జియం సూపర్‌‌‌‌ విక్టరీ.. టైల్‌‌‌‌మన్స్‌‌‌‌ డబుల్‌‌‌‌ గోల్‌‌‌‌

Belgium vs Senegal: ఫిఫా వరల్డ్ కప్‌‌‌‌లో బెల్జియం పోరాటపటిమను చూపెట్టింది. రెండు గోల్స్‌‌‌‌ వెనుకంజలో ఉన్నా.. అసాధారణ ఆటతీరుతో సెనెగల్‌‌‌‌పై 3–2 తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించింది. ఎక్స్‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌ (120+5వ ని) చివరి నిమిషంలో లభించిన పెనాల్టీని యూరి టైల్‌‌‌‌మన్స్‌‌‌‌ అద్భుతమైన గోల్‌‌‌‌గా మలిచాడు. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ చరిత్రలో ఎక్కువ అలస్యంగా నమోదైన గోల్‌‌‌‌ ఇదే కావడం విశేషం. రొమేలు లుకాకు (86వ ని) తొలి గోల్‌‌‌‌ కొట్టగా, 89వ నిమిషంలో టైల్‌‌‌‌మన్స్‌‌‌‌ మరో గోల్‌‌‌‌ సాధించాడు. సెనెగల్‌‌‌‌ తరఫున హబీబ్‌‌‌‌ దియారా (24వ ని), ఇస్మాయిలా సార్‌‌‌‌ (51వ ని) గోల్స్‌‌‌‌ చేశారు. తొలి సగం భాగం మొత్తం సెనెగల్‌‌‌‌ జోరే కొనసాగింది. వరుసగా ఎదురు దాడులు చేసి 1–0 ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌‌‌‌ ఆరంభంలోనే మరో గోల్‌‌‌‌తో ఆధిక్యం 2–0కు పెరిగింది. దాంతో ఒత్తిడికి లోనైన బెల్జియం అటాకింగ్‌‌‌‌ గేమ్‌‌‌‌తో ముందుకెళ్లింది. 86వ నిమిషంలో సబ్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌గా వచ్చిన లుకాకు హెడర్‌‌‌‌ ద్వారా బెల్జియంకు తొలి గోల్‌‌‌‌ అందించాడు. మరో మూడు నిమిషాల తర్వాత టైల్‌‌‌‌మన్స్‌‌‌‌ గోల్‌‌‌‌ కొట్టడంతో స్కోరు 2–2తో సమమైంది. ఇక్కడి నుంచి సెనెగల్‌‌‌‌ ఆధిక్యం పెరగకుండా బెల్జియం గోల్‌‌‌‌ కీపర్‌‌‌‌ తిబౌత్‌‌‌‌ కోర్టోయిస్‌‌‌‌ మూడు కీలకమైన గోల్స్‌‌‌‌ను అడ్డుకున్నాడు. ఇక డ్రా అనుకున్న తరుణంలో టైల్‌‌‌‌మన్స్‌‌‌‌ ఇంజ్యురీ టైమ్‌‌‌‌ చివరి నిమిషంలో పెనాల్టీని గోల్‌‌‌‌గా మలిచి బెల్జియంకు చిరస్మరణీయ విజయం అందించాడు. ఓవరాల్‌‌‌‌గా నాకౌట్‌‌‌‌ దశలో రెండు గోల్స్‌‌‌‌ వెనకబడి కూడా బెల్జియం గెలవడం గత 11 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ల్లో ఇది రెండోసారి. 

హీరో నుంచి విలన్‌‌‌‌గా మారిన బాలోగన్
శాంటాక్లారా: బోస్నియా హెర్జెగోవినాతో జరిగిన రౌండ్‌‌‌‌–32 మ్యాచ్‌‌‌‌లో అమెరికా 2–0తో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌‌‌‌లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌‌‌‌లో సూపర్‌‌‌‌ గోల్‌‌‌‌తో యూఎస్‌‌‌‌ను ముందంజంలో నిలిపి హీరోగా మారిన స్ట్రయికర్‌‌‌‌ ఫోలారిన్‌‌‌‌ బాలోగన్‌‌‌‌ 64వ నిమిషంలో రెడ్‌‌‌‌కార్డుతో గ్రౌండ్‌‌‌‌ను వీడాడు. మాలిక్‌‌‌‌ టిల్‌‌‌‌మన్‌‌‌‌  (82వ ని) మరో గోల్‌‌‌‌ కొట్టాడు. ఆట 45వ నిమిషంలో మాలిక్ టిల్‌‌‌‌మన్ అందించిన పాస్‌‌‌‌ను బోస్నియా డిఫెండర్లు అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దీనిని అందిపుచ్చుకున్న బాలోగన్ ఎడమకాలితో అద్భుతమైన గోల్ చేసి అమెరికాకు 1-–0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ టోర్నీలో అతడికిది మూడో గోల్. సెకండాఫ్‌‌‌‌ ఆరంభంలో బోస్నియా ఆటగాడు తారిక్ ముహారెమోవిచ్ చీలమండను తొక్కడంతో బ్రెజిల్ రెఫరీ రాఫెల్ క్లాస్ వీడియో రివ్యూ ద్వారా బాలోగన్‌‌‌‌కు రెడ్ కార్డ్ విధించాడు. దీంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. సోమవారం బెల్జియంతో జరగబోయే కీలకమైన తదుపరి మ్యాచ్‌‌‌‌కు అతడు దూరం కానున్నాడు. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నాకౌట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో గోల్ కొట్టి రెడ్ కార్డ్ పొందిన మూడో ఆటగాడిగా బాలోగన్ నిలిచాడు.  గతంలో బ్రెజిల్ స్టార్ రొనాల్డీన్హో (2002), ఫ్రాన్స్ దిగ్గజం జినెదిన్ జిదాన్ (2006) మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు.