హైదరాబాద్, వెలుగు: నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని గ్రూప్–1 ఆఫీసర్లకు కొత్త సీఎస్ సంజయ్ జాజు సూచించారు. ప్రభుత్వ స్కీమ్‌లు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు చేర్చాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. గురువారం సెక్రటేరియెట్‌లో గ్రూప్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు సర్వేశ్వర్ రెడ్డి, హనుమంతు నాయక్, ఆలోక్ కుమార్ , సోమశేఖర్ కొత్త సీఎస్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పనిపై అంకితభావం చూపిస్తూ నిబద్ధతతో పని చేసి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించడం, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంలో గ్రూప్–1 అధికారుల పాత్ర కీలకమని, అందుకు అనుగుణంగా పని చేయాలని సూచించారు.
