- ఫిన్‌ల్యాండ్ ఎన్‌ఐఏకు కేసు బదిలీ హైకోర్టుకు నివేదించిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: ఫిన్‌లాండ్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థి మే 6 నుంచి అదృశ్యం పై నమోదైన కేసును ఫిన్‌లాండ్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు తెలిపింది. కేసు వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన మణిదీప్ ఫిన్‌లాండ్‌లోని ఎల్‌యూటీ వర్సిటీలో చదువుకుంటూ మే 6 నుంచి కనిపించకుండా పోయాడు.
ఈ ఘటనపై చర్యలు తీసుకోలేదంటూ అతని తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, విద్యార్థి గతేడాది మార్చిలో చదువుల కోసం ఫిన్‌లాండ్ వెళ్లాడని, మే 5న తల్లితో చివరిసారిగా మాట్లాడిన తర్వాత అతడి నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది వాదిస్తూ, పిటిషనర్ ఫిర్యాదుతో విద్యార్థి అదృశ్య కేసును గత నెల 22న ఫిన్‌లాండ్‌లోని ఎన్‌ఐఏకు అప్పగించినట్లు తెలుపుతూ, విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
