హైదరాబాద్, వెలుగు: గాంధీ భవన్లో గురువారం నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణా రావు పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వివిధ వర్గాల ప్రజలు, పార్టీ కార్యకర్తలు పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. కొన్ని సమస్యలపై మంత్రి అప్పటికప్పుడు స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించారు.
మరికొన్నింటిపై కూడా మంత్రి స్పందిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ... ఇది మంచి ప్రోగ్రామ్ అని, ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎంతో ఉపయోగపడుతున్నదని మంత్రి పేర్కొన్నారు.
