ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. 24 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం 

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. 24 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం 
  • మ్యాన్‌‌‌‌హోల్‌‌‌‌లో పడి వ్యక్తి.. కరెంట్ షాక్​తో బాలిక మృతి
  • ఘటనలపై మహారాష్ట్ర సర్కార్ సీరియస్.. 
  • నలుగురు ఆఫీసర్లపై వేటు
  • ఐదు రోజులు ఆలస్యంగా ఢిల్లీని తాకిన వర్షాలు
  • రాజస్తాన్‌‌‌‌లోకి కూడా రుతుపవనాల ఎంట్రీ  
  • ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, యూపీ, 
  • పంజాబ్‌‌‌‌లలో దంచికొడ్తున్న వానలు

ముంబై/న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని ముంబై నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. గడిచిన 24 గంటల్లోనే నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దాదర్, పరేల్, హింద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాతా, వర్లి, గోరెగావ్, అంధేరి వంటి ప్రధాన ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 

రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మునగనప్పటికీ.. సిగ్నలింగ్ లోపాల వల్ల లోకల్ రైళ్లు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. రాబోయే 24 గంటల్లో ముంబై , దాని పరిసర ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ (ఐఎండీ) హెచ్చరించింది. మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడి వ్యక్తి.. 

కరెంట్ షాక్‌తో బాలిక మృతి

భారీ వర్షాలతో ముంబైలోని చాందివాలీ ఏరియాలో  ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై తెరిచి ఉన్న మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడి అస్లాం ఇషాక్ షేక్ (55) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఖైరానీ రోడ్డులో మురుగునీటి లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రొటెక్ట్  గ్రిల్ ఏర్పాటు చేయడానికి కార్మికులు మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్ మూత తీశారు. ఆ సమయంలో అస్లాం మొబైల్ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. నీటి ప్రవాహం బలంగా ఉండటంతో అతను కొట్టుకుపోయాడు. 

ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది గాలించి అతని మృతదేహాన్ని వెలికితీశారు. ముంబైలో ఈ వారంలో వర్షాల వల్ల జరిగిన రెండో మరణం ఇది. ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అసిస్టెంట్ కమిషనర్ ధనాజీ హెర్లేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నలుగురు మున్సిపల్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసింది. సంబంధిత కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టింది. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. 

ఘటనపై మున్సిపల్ కమిషనర్ అశ్విని భిడే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. రాబోయే ఎనిమిది రోజులు నగరంలోని అన్ని మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోళ్లను పూర్తిగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర అసెంబ్లీలోనూ తీవ్ర దుమారం రేగింది. ఈ అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యే అమిత్ సతమ్ సభలో లేవనెత్తారు. దీనిపై స్పందించిన స్పీకర్ రాహుల్ నార్వేకర్.. ఘటన అత్యంత తీవ్రమైనదని.. ఇది బాధ్యతారాహిత్యంతో జరిగిన నరహత్య కిందకే వస్తుందని అభివర్ణించారు. 

బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పీకర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. భారీ వర్షాలు థానే నగరంలోనూ ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. ముంబ్రా ప్రాంతంలో గల యాస్మిన్ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కరెంట్ షాక్ కు గురై ఆలియా అనే 17 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో నడుచుకుంటూ వెళ్తుండగా  ఆమెకు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఉత్తరాఖండ్ అతలాకుతలం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పర్వత ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. కొండలపై నుంచి పెద్ద ఎత్తున రాళ్లు, శిథిలాలు విరిగిపడుతున్నాయి. దీనివల్ల చమోలి జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రుద్రప్రయాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అలకనంద, మందాకిని నదుల నీటిమట్టాలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. దాంతో స్థానిక యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వాతావరణ శాఖ డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, బాగేశ్వర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.  

దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి 

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. సాధారణ షెడ్యూల్ కంటే ఐదు రోజులు ఆలస్యంగా గురువారం రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. జులై నెలలో రుతుపవనాలు ఢిల్లీకి రావడం 2021 తర్వాత ఇదే మొదటిసారి అని ఇండియన్ మెటీరియోలాజికల్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ (ఐఎండీ) తెలిపింది. రుతుపవనాల రాకతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. 

కనీస ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.1 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఢిల్లీలో గాలి నాణ్యత కూడా మెరుగుపడి సంతృప్తికరంగా మారింది. రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, సాధారణ తేదీ కంటే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు రాజస్తాన్ రాష్ట్రంలోకి కూడా ప్రవేశించాయి.