దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామాలయంలో నిధులు చోరీ ఘటనలో ఆర్ఎస్ ఎస్ ఎట్టకేలకు స్పందించింది. నిధులను దోచుకోవడం దురదృష్టకరం, ఈ చర్యను ఖండిస్తున్నామని ఆర్ఎస్ఎస్ ప్రధాని కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే అన్నారు. హిందు మతాన్ని, హిందువులను అపఖ్యాతి పాలు చేసేందుకు కుట్ర జరుగుతోంది.. ఈ ఘటనను ఉపయోగించుకొవాలని దేశ వ్యతిరేక శక్తులు, హిందు వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి.. ప్రజలు అడ్డుకోవాలని అన్నారు.
అయోధ్య రామాలయంలో చోరీ ఘటనపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) తొలిసారి స్పందించింది. ఆలయం నిధుల దుర్వినియోగం దురదృష్టకరం.. ఈ క్లిష్ట సమయంలో హిందూ సమాజం సహనం, సంయమనం పాటించాలని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే పిలుపునిచ్చారు. హిందూ మతాన్ని , హిందువులను అపఖ్యాతి పాలు చేసేందుకు కుట్ర జరుగుతోంది.. ఈ ఘటనను ఉపయోగించుకొని లబ్ధిపొందాలని చూస్తున్న హిందూ, దేశ వ్యతిరేక శక్తుల ప్రయత్నాలను అడ్డుకోవాలని అధికారిక ప్రకటన లో ప్రజలకు విజ్ణప్తి చేశారు.
►ALSO READ | అమెరికాలో రూ.85 వేల మాత్ర.. ఇండియాలో కేవలం 35 రూపాయలకే.. యూఎస్ మహిళ వీడియో వైరల్
