మధ్యలో కేటీఆర్ ఎవరు, హరీష్ ఎవరు..? నేను కేసీఆర్ కే సవాల్ విసురుతున్నా: డిప్యూటీ సీఎం భట్టి 

మధ్యలో కేటీఆర్ ఎవరు, హరీష్ ఎవరు..? నేను కేసీఆర్ కే సవాల్ విసురుతున్నా: డిప్యూటీ సీఎం భట్టి 

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ళతో రాష్ట్రము దద్దరిల్లుతోంది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై ఇరు వర్గాల పరస్పర సవాళ్లతో గురువారం తెలంగాణ భవన్, గన్ పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సవాళ్ల పర్వంలోకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఎంటర్ అయ్యారు. శుక్రవారం ( జులై 3 ) మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్  కే తన సవాల్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భట్టి. రాష్ట్రాన్ని ఆగం చేసినవాళ్ళే ఏం మాట్లాడట్లేదని... మధ్యలో కేటీఆర్, కేసీఆర్ ఎవరు అంటూ ప్రశ్నించారు భట్టి.

కేసీఆర్ అప్పులు చేసి ప్రజలపై భారం వేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మొత్తం రూ.8 లక్షల 21 వేల కోట్ల అప్పులు చేసింది వాస్తవం కాదా అని అన్నారు భట్టి. అబద్దాలతో ఎంతకాలం మోసం చేస్తారని అన్నారు. ఈ అప్పులపై సమాధానం చెప్పాల్సింది కేసీఆరే అని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అప్పులపై వైట్ పేపర్ రిలీజ్ చేశామని...కేసీఆర్ చేసిన అప్పులకు రూ.2 లక్షల 8 వేల కోట్లు వడ్డీ కడుతున్నామని అన్నారు. రూ. 3 లక్షల కోట్లే అప్పు ఉందని అబద్దాలు చెబుతున్నారని అన్నారు భట్టి. బీఆర్ఎస్ హయాంలో 10.5 శాతం వడ్డీకి అడ్డగోలుగా అప్పు తెచ్చారని... తమ ప్రభుత్వం వచ్చాక రిస్ట్రక్చర్ చేసి 7.5 శాతానికి తగ్గించామని అన్నారు భట్టి.