హైదరాబాద్: AMB Mall ఎదురున్న వాహ్ మండీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. శుచి శుభ్రత విషయంలో.. ఈ మండీకి 100కు 61 మార్కులు మాత్రమే వేశారు. కిచెన్లో గానీ, మండీలో మరెక్కడా గానీ పురుగులు, బొద్దింకలు లాంటివి కనిపించలేదు. ఫ్రీజర్‌లను శుభ్రంగా ఉంచారు.
🍽️ Food Safety Inspection Drive
— Cyberabad Municipal Corporation (@CMC_Offcl) July 4, 2026
Establishment: Wah Mandi
📍 Opp. AMB Mall
📅 04.07.2026
As part of routine food safety inspections across Cyberabad, CMC Food Safety teams inspected Wah Mandi.
✅ Good Practices
• Regular pest control with no visible pest infestation
•… pic.twitter.com/ixAelihUW9
చికెన్, మటన్ నిల్వ పరిమితంగా ఉంది. పాడైపోయిన, నిల్వ ఉంచిన వండిన.. ఉడికించిన గుడ్లు, చికెన్ వింగ్స్‌ను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికక్కడే పారవేశారు. పాత్రలు కడుక్కోవడానికి వాష్ ఏరియాలో తగినంత ప్రదేశం లేదని గుర్తించారు. వేడి నీటితో శానిటైజ్ చేయడం పాటించలేదని తేల్చారు.
పచ్చి, వండిన మాంసాన్ని కలిపి నిల్వ చేసినట్లు గుర్తించారు. శాకాహార, మాంసాహార వస్తువులను సరిగ్గా వేరు చేయలేదని.. కూరగాయలు కోసే చోట గోడలు, పైకప్పు పెచ్చులూడటాన్ని గమనించారు. పాడైపోయిన ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేశారు. మెరుగుదల నోటీసును జారీ చేసి, వెంటనే పద్ధతి మార్చుకోవాలని మండీ యాజమాన్యానికి సూచించారు.
