రామాలయం అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కమిటీ..ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

రామాలయం అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కమిటీ..ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు

భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ధార్మిక అడ్వైజర్ గోవింద్ హరీ కన్వీనర్ గా నియామకం కాగా భద్రాచలం ఈవో దామోదర్​రావు, భద్రాద్రి కొత్తగూడెం ఆర్​అండ్​బీ ఎస్ఈ లాల్​సింగ్, దేవస్థాన ఈఈ రవీందర్​రాజు, స్థపతి వల్లీనాయగన్, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్​, స్థానాచార్యులు స్థల సాయి, ఆర్కిటెక్ సూర్యనారాయణమూర్తి, కాంట్రాక్టర్​వై.రామకృష్ణారెడ్డిలను సభ్యులుగా నియమించారు. రూ.351 కోట్లతో ప్రారంభమైన అభివృద్ధి పనులను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.