రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతోంది.. ఏటా సగటున 1.73 లక్షల మంది చనిపోతున్నారు

రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతోంది.. ఏటా సగటున 1.73 లక్షల మంది చనిపోతున్నారు

దేశంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయికి చేరుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాలతో ఏటా1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ప్రతి ఏటా11 లక్షల మందికిపైగా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుండగా, దాదాపు 5 కోట్ల మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు. ప్రమాదాల్లో ఎక్కువగా యువకులే బలవుతుండటం మరింత కలవరపెడుతోంది. ఈ పరిస్థితి రహదారి భద్రత , ట్రాఫిక్ నిబంధనల అమలు, అతివేగం నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా–2024 రిపోర్టుల ప్రకారం దేశంలో ప్రతి గంటకు సగటున 56 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి ఏటా 4.81 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదు అవుతుండగా సగటున 1.73 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ లెక్కన నెలకు సుమారు 40వేల రోడ్డు ప్రమాదాలు, 14వేల మరణాలు, రోజుకు 1335 ప్రమాదాలు, 480 మంది మరణిస్తు్న్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. 

ALSO READ : ఒకే ఒక్క రాత్రి వర్షానికి కుంగిపోయిన 12 వేల కోట్ల జాతీయ రహదారి..!

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో 11 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు 5కోట్ల మంది వైకల్యం పాలవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ప్రాణాలు కోల్పో్వారు యువకులే. 5 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వాకు ఉన్నారు.  మృతుల్లో సగానికి పైగా పాదచారులు, సైకిల్ తొక్కేవారు,బైకులు నడిపేవారే ఉన్నారు. 

నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాల్లో లక్షలాది మంది  ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాలు చెబుతున్నాయి. అతివేగం కారణంగానే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. సగటున 1శాతం  వేగంపెరిగితే 4శాతం  ప్రమాదాలకు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలేసింది. రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.  2026 మొదటి ఆరునెలల్లో  రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు రెట్టింపు అయ్యాయి. 

2020లో COVID-19 కారణంగా రోడ్డు ప్రమాదాలు, మరణాల్లో తాత్కాలిక తగ్గుదల నమోదు అయినప్పటికీ  ఆ తర్వాత ప్రతి ఏడాది ప్రమాదాలు, మరణాల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తోంది. Annual Trend ప్రకారం 2020 మినహా మిగతా సంవత్సరాల్లో రోడ్డు ప్రమాదాలు, మరణాలు స్థిరంగా పెరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితి రహదారి భద్రత , ట్రాఫిక్ నిబంధనల అమలు, అతివేగం నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.