న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ప్రధాని మోడీకి హత్య బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ప్రధాని మోడీ తన చావు కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నాడని ఫేస్‌బుక్ వేదికగా బెదిరింపులు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2026, జులై 9న మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో జరగనున్న మెల్‌బోర్న్ మీట్స్ మోడీ కమ్యూనిటీ ఈవెంట్‌కు సంబంధించిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్‌కు అబు ముస్తఫా అనే అకౌంట్ నుంచి ఈ హత్య బెదిరింపు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
మెల్‌బోర్న్ మీట్స్ మోడీ కార్యక్రమం జరిగే సమయంలో స్టేడియం రూఫ్ టాప్‌లను మూసివేయడం మంచిదని.. లేకపోతే మోడీ తన మరణం కోసమే ఆస్ట్రేలియాకు వస్తున్నట్లే అని కామెంట్స్‌లో గుర్తు తెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా బెదిరింపులకు పాల్పడ్డ ఖాతాకు సంబంధించిన ఐపీ అడ్రస్‌ను గుర్తించారు. ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని తెలిపారు. హత్య బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని మోడీ భద్రతను కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు.
ALSO READ : మమత బెనర్జీకి మరో షాక్..టీఎంసీ బెంగాల్ చీఫ్ చంద్రమా భట్టాచార్య రాజీనామా
ప్రధాని మోడీ ఆస్ట్రేలియా టూర్
ప్రధాని మోడీ జూలై 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంతో పాటు ద్వైపాక్షిక సమావేశాలు, సామాజిక కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. ఆస్ట్రేలియా-భారత్ వార్షిక నాయకుల శిఖరాగ్ర సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కూడా మోడీ చర్చలు జరపనున్నారు.
