పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీ బెంగాల్ అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య ఆ పార్టీకీ రాజీనామా చేశారు. శనివారం (జూలై 4) తన రాజీనామాను ప్రకటించిన భట్టాచార్య, రెబల్ లీడర్లతో సమావేశం అయ్యారు. భట్టాచార్య రాజీనామాతో బెంగాల్ లో మమతా బెనర్జీకీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత భట్టాచార్యను టీఎంసీ బెంగాల్ స్టేట్ చీఫ్ గా నియమించింది మమతా బెనర్జీ. బీజేపీ చేతిలో ఓటమి తర్వాత జూన్ 3న అన్ని పార్టీ కమిటీలను రద్దు చేసిన మమతా .. సుబ్రతా బక్షి స్థానంలో భట్టాచార్యన రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. చంద్రమా భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి ,చాలా కాలం పాటు మమతకు అత్యంత సన్నిహితులలో ఒకరు.
