గుడ్ న్యూస్: 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్... నోటిఫికేషన్ ఇవ్వనున్న రిక్రూట్మెంట్ బోర్డు..

గుడ్ న్యూస్: 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్... నోటిఫికేషన్ ఇవ్వనున్న రిక్రూట్మెంట్ బోర్డు..

హైదరాబాద్, వెలుగు: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పరిపాలనా నియంత్రణలోని వివిధ విభాగాలలో ఉన్న ఈ 5 వేల పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డుకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని బోర్డును ప్రభుత్వం ఆదేశించింది. 

స్థానిక క్యాడర్ల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, అవసరమైన విద్యార్హతలు వంటి పూర్తి వివరాలను సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ ఈ వివరాలను తక్షణమే రిక్రూట్‌‌మెంట్ బోర్డుకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

శాఖాపరమైన అవసరాలు, ఆర్థికపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం ఈ పోస్టుల భర్తీకి తుది అనుమతులు మంజూరు చేసింది. ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపడంతో ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. 

పోస్టుల సంఖ్య

  • సబ్-ఇన్‌‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్)                          148
  • సబ్-ఇన్‌‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్)                             14
  • రిజర్వ్ సబ్-ఇన్‌‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీజీఎస్పీ)           12
  • సబ్-ఇన్‌‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్ఏఆర్ సీపీఎల్)           3
  • అసిస్టెంట్ సబ్-ఇన్‌‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 
  • (ఫింగర్ ప్రింట్ బ్యూరో )                                                    23
  • పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)                                          3,697
  • పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్)                                          1,052
  • పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్)                         24
  • పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పీటీఓ                                  20
  • పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్) పీటీఓ                                  7 
  • మొత్తం                                                                            5,000