పాత కార్ల వ్యాపారం అని నమ్మించారు..తన దగ్గర సరిపోను పెట్టుబడి లేదని నమ్మబలికారు. మీ సొమ్ము ఎక్కడా పోదు.. మంచి లాభాలుంటాయి.. మంచి బిజినెస్ అని వెంటబడ్డారు.. నమ్మినోళ్లను నట్టేట ముంచి కోట్ల రూపాయలకు మోసం చేసిన కిలాడి జంటను హైదరాబాద్సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలామందినుంచి రూ. 1.58 కోట్లకు మోసం చేశారని గుర్తించారు. అహ్మద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులను వాజిద్ అహ్మద్ ఖాన్, అతని భార్య ఆర్తి కుమారిగా గుర్తించారు.
వాజిద్ అహ్మద్ ఖాన్ తనకు వ్యక్తిగతంగా తెలుసని పేర్కొంటూ రాయీస్ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 2025లో, పాత కార్ల కొనుగోలు, అమ్మకాలలో నిమగ్నమైన CARS24 అనే కంపెనీలో తాను పనిచేస్తున్నానని చెబుతూ ఖాన్ .. తనతోపాటు పెట్టుబడి పెడితే మంచి లాభాలుంటాయని నమ్మించాడని బాధితుడు తెలిపారు.
CARS24 కంపెనీనుంచి వాడిన కార్లను తక్కువ ధరలకు కొనుగోలు చేసి, వాటిని అధిక ధరలకు తిరిగి అమ్మి గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉందని ఖాన్ అహ్మద్‌తో నమ్మించి, ఆ వ్యాపారం చేయడానికి తన వద్ద తగినంత పెట్టుబడి లేదని చెబుతూ, తనతో కలిసి డబ్బు పెట్టుబడిగా పెట్టమని కోరినట్లు తెలిపాడు.
ALSO READ : వలస కార్మికుల పిల్లలకోసం.. హైదరాబాద్ లో వర్క్ సైట్ స్కూల్స్
అతను పెట్టుబడి సురక్షితమని, అధిక రాబడి వస్తుందని అహ్మద్‌కు హామీ ఇవ్వడంతో అహ్మద్ రూ.58 లక్షలు పెట్టుబడిగా పలుమార్లు వాజిద్ అహ్మద్ ఖాన్, ఆర్తి కుమారి ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేశాడు బాధితుడు. అహ్మద్ స్నేహితులతో కూడా పెట్టుబడులు పెట్టించాడు. పెట్టుబడిదారులందరి నుంచి మొత్తం రూ. 1.58 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
