Vaibhav Sooryavanshi: ఇంగ్లాండ్‌తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు తొలిసారి ఇండియాకు ఎంపికైన వైభవ్.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక ఈరోజు మాంచెస్టర్‌లో జరగబోయే రెండో మ్యాచ్‌కు ముందు వైభవ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కొత్త అధ్యాయం అంటూ ఒక క్యాప్షన్‌ను జోడించాడు. దీంతో అతని నిరీక్షణ ముగిసిందని, ఈ మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇన్‌స్టా స్టోరీతో అరంగేట్రంపై క్లారిటీ:
వైభవ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అరంగేట్రంపై ఆశలు రేకెత్తిస్తున్నప్పటికీ.. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం అతడు మరికొంత కాలం వేచి చూడక తప్పదనే సంకేతాలు ఇచ్చాడు. ఇటీవల భారత్ గెలిచిన టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన సీనియర్ ప్లేయర్స్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కఠినమైన పరిస్థితుల్లో జట్టును గెలిపించిన ఆటగాళ్లను బ్యాక్ చేస్తూనే, ఇక్కడి కండిషన్స్‌కు తగ్గట్టుగా టాప్ ఆర్డర్‌ను పటిష్టం చేయడమే తమ ప్రస్తుత లక్ష్యమని మోర్కెల్ పేర్కొన్నారు.
వరల్డ్ కప్ హీరోలకే మేనేజ్‌మెంట్ ఓటు:
2026 టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీనే రెండో టీ20లోనూ కొనసాగించేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ఇంట్రెస్ట్ చూపుతోంది. గత మూడు మ్యాచ్‌ల్లో శాంసన్ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పటికీ.. వరల్డ్ కప్ నాకౌట్ దశలో అతను ఆడిన వరుస మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ల ట్రాక్ రికార్డ్‌ను బట్టి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అతనికి మరో ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నాడు. దీనివల్ల వైభవ్‌కు ఈ మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది.
Vaibhav Sooryavanshi was seen batting in the nets and chatting with head coach Gautam Gambhir.#VaibhavSooryavanshi #ENGvsIND pic.twitter.com/xZDukc9xhX
— CREX (@Crex_live) July 4, 2026
🚨 Vaibhav sooryavanshi is making his debut today
— Kartik Sharma (@KartikSharmaFC) July 4, 2026
- 1st he posted a story where he is saying "New chapter started" and
- Now gennex cricket academy where vaibhav sooryavanshi was trained.. they posted a reel with caption of "All the best vaibhav sooryavanshi for debut match… pic.twitter.com/l1QFXo1v12
