డిప్లొమా, BSC పూర్తయిన వారికి గుడ్ న్యూస్.. UGC DAE CSR లో మంచి ఉద్యోగాలు

డిప్లొమా, BSC పూర్తయిన వారికి గుడ్ న్యూస్.. UGC DAE CSR లో మంచి ఉద్యోగాలు

యూజీసీ డీఏఈ  కన్సార్టియం ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (యూజీసీ డీఏఈ సీఎస్ఆర్) జూనియర్ ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
ఖాళీలు: 04 (జూనియర్ ఇంజినీర్ – సి 03, టెక్నీషియన్ –డి 1). 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఎస్సీ ఫిజిక్స్ పూర్తిచేసి ఉండాలి. మెకానికల్/ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అకడమిక్ రీసెర్చ్ లేదా ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్​లో నాలుగేండ్ల అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 16. 
లాస్ట్ డేట్: మార్చి 06.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు csr.res.in 
వెబ్​సైట్​ను సందర్శించండి.