జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పెద్ద వివాదం చెలరేగింది. ఓ క్రికెటర్ ధరించిన హెల్మెట్ పై ఉన్న గుర్తు వివాదాస్పదమైంది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అయిన ఫొటోలు నెటిజన్లు ఫైర్ అయ్యారు. మన దేశంలో ఉంటూ, మనదేశంలో క్రికెట్ ఆడుతూ.. పరాయి దేశాన్ని ప్రమోట్ చేస్తాడా.. అంటూ క్రికెట్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఆ క్రికెటర్ పై చర్యలు కూడా తీసుకున్నారు. వివాదం చెలరేగిన తర్వాత ఆ క్రికెటర్‌ను లీగ్ నుండి నిషేధించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.
జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో ఓ క్రికెటర్ హెల్మెట్ పై వివాదాస్పదమైన జెండాను ధరించి కనిపించాడు. ఫుర్ఖాన్ భట్ అనే క్రికెటర్ పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ ను ధరించి బ్యాటింగ్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
సోషల్ మీడియాలో ఫుర్ఖాన్ భట్ హెల్మెట్ ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. భారత్ లో ఉంటూ.. పాలస్తీనా జెండా మోయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విషయం తెలుసుకున్న జమ్మూకాశ్మీర్ పోలీసులు..విచారణకు పిలిపించారు క్రికెటర్ కు పోలీసులు. ఎందుకు పరాయి దేశం జెండా ధరించాల్సి వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు. ఇక ఈ వివాదానికి కారణమైన జమ్మూకాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ నిర్వాహకుడికి కూడా పోలీసులు నోటీలిచ్చారు.
ఈ వివాదం పై జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ టోర్నీకి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. అంతేకాదు పుర్ఖాన్ భట్ కు JKCA కి సంబంధం లేదని తేల్చిచెప్పింది.
ఈ వివాదంలో జమ్మూ కాశ్మీర్ ఛాంపియన్స్ లీగ్ నిర్వాహకులు జాహిద్ భట్‌ను కూడా పోలీసులు పిలిపించారని విచారించారని తెలుస్తోంది.
