ఓ పక్క గిగ్ వర్కర్ యూనియన్ల మ్మె.. మరో పక్క న్యూఇయర్ వేడుకలు.. డెలివరీలు ఎలా చేయాలి..ఎంత నష్టం వస్తుందో..ఈయేడాది వ్యాపారం దెబ్బతిన్నట్టేనా..డెలివరీలు భారీగా పడిపోతాయా.. ఇది నిన్నటి వరకు జొమాటో, బ్లింకిట్ యాజమాన్యం తర్జనభర్జన..కానీ ఇవాళ కళ్లుచెదిరిపోయే డెలివరీల నమోదు చూసి ఫుల్ ఖుషీ.. ఇదే విషయాన్ని స్వయంగా జొమాటో ఎటర్నల్ సీఈవో ప్రకటించాడు.
జనవరి 1న ఎటర్నల్ సహ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ..ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో ,క్విక్ కామర్స్ ఆర్మ్ బ్లింకిట్ కు చెందిన కొత్త సంవత్సరం డెలివరీలను ప్రకటించారు. ఈ రోజు రికార్డు స్థాయిలో డెలివరీలు సాధించాం.. డెలివరీ కార్మికుల సమ్మె ఉన్నప్పటికీ తమ బిజినెస్ పై ఎలాంటి ప్రభావితం చూపలేదని చెప్పారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫాం Xలో జొమాటో, బ్లింకిట్ డెలివరీల వివరాలను షేర్ చేశాడు దీపిందర్ గోయల్. డిసెంబర్ 31న రెండు ఫ్లాట్ ఫాంలలో 75లక్షలు డెలివరీలు జరిగాయని రాశారు.దీనికోసం 4.5 లక్షల మంది వర్కర్లు పనిచేశారని తెలిపారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని.. ఎక్కువ ప్రోత్సాహకాలు లేకుండానే న్యూఇయర్ లో ఈ రికార్డు సాధించామని అన్నారు.
గత కొద్ది రోజులుగా జొమాటో, బ్లింకిట్ గిగ్ వర్కర్లు సమ్మె ఉన్నారు.. అయినా కొత్త సంవత్సరం వ్యాపారం పై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. ఆన్ గ్రౌండ్ టీంతో సమన్వయంతో ఇది సాధించామన్నారు.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ , ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ నేతృత్వంలో డిసెంబర్ 25 , డిసెంబర్ 31 తేదీలలో గిగ్ ,ప్లాట్‌ఫామ్ డెలివరీ కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.డిసెంబర్ 25 న తక్కువ మంది వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. ఇది డిసెంబర్ 31న భారీ సంఖ్యలో వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. డిసెంబర్ 25 నిరసనలో 40వేలమంది, డిసెంబర్ 31న దేశ వ్యాప్తంగా 1.70లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని గిగ్ వర్కర్స్ యూనియన్లు చెబుతున్నాయి. దీంతో అనేక నగరాల్లో జొమాటో, బ్లింకట్ డెలివరీల్లో జాప్యం జరిగిందని అంటున్నారు.
