సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడం.. ఇలా అన్నీ భాషల్లో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఆయా భాషల్లోని స్టార్ హీరోలతోనే నటిస్తుండటం విశేషం. 2026లో నయన్ సినిమాలు చూసుకుంటే.. తెలుగులో చిరంజీవి సరసన ‘మన శంకర వరప్రసాద్ గారు’, బాలకృష్ణతో ‘NBK111’, మలయాళంలో మోహన్ లాల్ ‘పేట్రియాట్’, కన్నడలో ‘టాక్సిక్’ తోపాటుగా తమిళంలో ‘మూకుతి అమ్మన్ 2’ చేస్తోంది. అలాగే, డియర్ స్టూడెంట్స్, Hi అనే చిన్న సినిమాలు సైతం చేస్తోంది.
అయితే, ఇన్నేసి సినిమాలు చేస్తున్నపటికీ.. ‘నయనతార ప్రమోషన్స్‌కి రాదు అనే విమర్శ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఉంది. అయితే, ఇప్పటివరకు దీనిపై నయన్ స్పందించలేదు. బేసిక్ గా నయనతార మొదటి నుంచీ “వర్క్ మాట్లాడాలి, నేను కాదు” అనే సిద్ధాంతాన్ని నమ్మే నటిగా పేరుంది. సినిమా విడుదల సమయంలో ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు, టీవీ షోలు వంటి ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఆమె కనిపించకపోవడం చాలా సార్లు నిర్మాతలు, దర్శకులకు సవాల్‌గా మారింది.
ఇండస్ట్రీ వర్గాల్లో ఇది కొత్త విషయం కాదు. కానీ ఇటీవల విడుదలైన సినిమాల సందర్భంగా ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకో తెలుసా.. ‘నయనతార ప్రమోషన్స్ చేయడానికి ముందుకొచ్చింది’. అది కూడా తెలుగు సినిమా కావడంతో, తెలుగు, తమిళ సినీ వర్గాల్లో మరోసారి చర్చకు దారీతీసింది. అయితే, నయనతార ప్రమోషన్స్ చేయడానికి ముందుకు రావడం వెనుక.. డైరెక్టర్ అనిల్ రావిపూడి హస్తం ఉందనడంలో సందేహం లేదు.
ఎందుకంటే, అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే.. ప్రమోషన్స్తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం. అనిల్ తన స్టైల్ ఫన్ని జోడిస్తూ ఆడియన్స్కి నచ్చేలా, వైరల్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఈ ఫార్ములా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అదే పంథాని మన శంకర వరప్రసాద్ మూవీ కోసం కూడా వాడుతున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్గా ఓ క్రేజీ వీడియో వదిలారు మేకర్స్.
హీరోయిన్ నయనతారతో కలిసి దర్శకుడు అనిల్ ప్రమోషన్స్‌ను అఫీషియల్‌గా ప్రారంభించాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో స్వయంగా నయనతార కనిపిస్తూ,
“సినిమా స్టార్టింగ్‌లో ఒక ప్రమోషనల్ వీడియో చేశాం… మరి ఇప్పుడు ఏం చేయాలి?” అని అనిల్‌ను ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు ఒక్కసారిగా షాక్ అయినట్టుగా నటించిన అనిల్,
“మేడమ్… మీరు ప్రమోషన్స్ గురించి అడగడమే పెద్ద ప్రమోషన్. మీరు జస్ట్ జనవరి 12 రిలీజ్ అని చెప్పేస్తే చాలు” అంటూ సమాధానం ఇస్తాడు.
దీంతో వెంటనే నయనతార నవ్వుతూ, “హలో మాస్టారు.. ఫేస్ కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోండి” అంటూ సరదాగా డైలాగ్ వేస్తుంది.
ఈ ఫన్ కన్వర్సేషన్‌తో రూపొందించిన వీడియో, ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంటోంది. ముఖ్యంగా నయనతార ప్రమోషన్స్‌కు రాదనే విమర్శల మధ్య, ఇలా క్రియేటివ్‌గా ప్రమోషన్ స్టార్ట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, “అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు?”అంటూ దర్శకుడు అనిల్‌ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, సింపుల్ కానీ ఇంపాక్ట్‌ఫుల్ ఐడియాతో నయనతార–అనిల్ కాంబినేషన్ ప్రమోషన్స్‌కు స్ట్రాంగ్ స్టార్ట్ ఇచ్చింది అని చెప్పొచ్చు.
