New Year2026: కొత్త ఆశలు.. సరికొత్త ఆశయాలు.. ఫ్యాన్స్ కు టాలీవుడ్ స్టార్ల న్యూ ఇయర్ విషెస్!

New Year2026: కొత్త ఆశలు.. సరికొత్త ఆశయాలు.. ఫ్యాన్స్ కు టాలీవుడ్ స్టార్ల న్యూ ఇయర్ విషెస్!

పాత జ్ఞాపకాలను వీడ్కోలు పలుకుతూ, సరికొత్త ఆశలు, ఆశయాలతో యావత్ భారతావని 2026కి ఘన స్వాగతం పలికింది. అర్థరాత్రి నుంచే బాణసంచా వెలుగులు, కేరింతలతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ముఖ్యంగా సినీ దిగ్గజాలు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ 'స్పిరిట్' విధ్వంసం.. 

ఈ ఏడాది న్యూ ఇయర్ ట్రీట్లలో అందరికంటే ముందు నిలిచారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'స్పిరిట్' (Spirit) నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. "అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. 'స్పిరిట్' ఎక్స్‌ప్లోజివ్ ఫస్ట్ లుక్‌తో 2026ని స్వాగతిద్దాం. పవర్‌ఫుల్ కొత్త ఆరంభాలకు ఇది సమయం" అంటూ ప్రభాస్ పోస్ట్ చేశారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.

 

స్టార్ల సందేశం.. ఆశావహ దృక్పథం

టాలీవుడ్ మెగాస్టార్ నుంచి యంగ్ టైగర్ వరకు ప్రతి ఒక్కరూ సానుకూల సందేశాలతో అభిమానుల్లో ఉత్సాహం నింపారు. "కోటి ఆశలు, ఐక్యతతో ఈ ఏడాదిని స్వాగతిద్దాం. అందరం కలిసి అందమైన అనుభవాలను సొంతం చేసుకుందాం" అంటూ ఐకమత్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేశారు. సోషల్ మీడియా వేదిగా మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. "గతేడాది కంటే ఈ ఏడాది మరిన్ని అవకాశాలను తీసుకురావాలని కోరుకుంటున్నా. మీ లక్ష్యాలను చేరుకొని సంతోషంగా ఉండాలి" అని ఆకాంక్షించారు కమల్ హాసన్.

"2026 మీ జీవితాల్లో వెలుగులు నింపాలి" అంటూ సింపుల్ అండ్ స్వీట్ విషెస్ అందించారు ఎన్టీఆర్.. తారక్ ప్రస్తుతం తన గ్లోబల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  "నా ప్రయాణంలో తోడున్న అభిమానులకే నా కృతజ్ఞతలు. మీ ప్రేమే నా బలం. రెట్టింపు ఉత్సాహంతో ఈ కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నానుఅని తన ఎమోషనల్ బాండింగ్‌ను పంచుకున్నారు అల్లు అర్జున్. "2025 నాకు ఎన్నో విజయాలను ఇచ్చింది. అదే ఉత్సాహంతో 2026ను ప్రారంభిద్దాం" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు కిరణ్ అబ్బవరం.

కేవలం శుభాకాంక్షలే కాదు, కొత్త సినిమాల పోస్టర్లు, టీజర్లు, టైటిల్ అనౌన్స్‌మెంట్లతో టాలీవుడ్ కళకళలాడుతోంది. మహేష్ బాబు - రాజమౌళి ప్రాజెక్ట్ నుంచి రామ్ చరణ్ వరకు ప్రతి హీరో తనదైన శైలిలో అప్‌డేట్లను ఇస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 2026 కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు, కోట్లాది మంది కలల సాకారానికి ఒక కొత్త వేదిక. సినిమా రంగం మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని, ప్రేక్షకులు ఆనందారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అంటూ పలువురు ప్రముఖులు పోస్ట్ చేశారు.!