ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ తన లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, సోషల్ యాక్టివిటీతో వార్తల్లో ఉండే సారా.. ఈసారి మాత్రం ఓ వివాదస్పద వీడియో కారణంగా సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
న్యూ ఇయర్ 2026 సెలబ్రేషన్స్ కోసం గోవా వెళ్లిన సారా టెండూల్కర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చేతిలో బీర్ సీసా పట్టుకుని రోడ్డుపై నడుస్తూ వెళుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీసింది. ఇపుడు ఈ వీడియోపై, నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
కొంతమంది ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం అంటూ సారాకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు మాత్రం సెలబ్రిటీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా మరింత జాగ్రత్తగా ఉండాలంటూ విమర్శలు చేస్తున్నారు. "ఇక్కడ ట్రోల్ చేయడానికి విలువైనది ఏమీ లేదు" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Sara Tendulkar Spotted With 𝗕𝗲𝗲𝗿 𝗕𝗼𝘁𝘁𝗹𝗲 At Arrosim Beach, Goa 😲 pic.twitter.com/cHSeqI1SzO
— Jara (@JARA_Memer) December 31, 2025
ఇకపోతే, క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ మద్యం, పొగాకు సంబంధిత బ్రాండ్లను ప్రమోట్ చేయలేదు. గతంలో ఆయన ఇటువంటి బ్రాండ్లకు దూరంగా ఉంటానని చేసిన ప్రతిజ్ఞను, ఎప్పుడు తప్పకుండా దాన్ని అక్షరాలా పాటించారు. ఈ క్రమంలో సచిన్ కుమార్తె అయినా సారా.. చేతిలో బీర్ సీసా పట్టుకుని బహిరంగంగా కనిపించడంతో, మరింత చర్చకు దారీతీసింది.
►ALSO READ | BookMyShowలో వచ్చిన రేటింగ్స్‌తో సూసైడ్ చేసుకుందాం ఆనుకున్నా: డైరెక్టర్ ఆవేదన
ఈ క్రమంలోనే, సచిన్ క్రమశిక్షణను ప్రస్తావిస్తూ సారాను ట్రోల్ చేస్తున్నారు. “తండ్రి అంతటి క్రమశిక్షణను పాటిస్తే, కుమార్తె ఇలా ప్రవర్తించడమేంటి?” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ, తండ్రి వ్యక్తిగత సిద్ధాంతాలను కుమార్తె జీవితానికి అన్వయించటం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై సారా రియాక్ట్ అవుతుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
