BookMyShow‌లో వచ్చిన రేటింగ్స్‌తో సూసైడ్ చేసుకుందాం ఆనుకున్నా: డైరెక్టర్ ఆవేదన

BookMyShow‌లో వచ్చిన రేటింగ్స్‌తో సూసైడ్ చేసుకుందాం ఆనుకున్నా: డైరెక్టర్ ఆవేదన

త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్​లో శ్రీనివాస్ మన్నె  తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’.  కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్‌, వంశీ నందిపాటి విడుదల చేశారు. బుధవారం (DEC31st) ఈ మూవీ సక్సెస్‌ మీట్ నిర్వహించారు.

‘నిజాయితీతో ఒక సినిమా తీస్తే హిట్ చేస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు’ అని ముఖ్య అతిథిగా హాజరైన ఫిలిం ఛాంబర్  ప్రెసిడెంట్ సురేష్ బాబు అన్నారు. ‘సినిమాల్లో చిన్నా, పెద్ద అన్నది లేదు. ఏది ఆడితే అదే పెద్ద సినిమా. అలా ‘ఈషా’ పెద్ద సినిమాగా నిలిచింది’ అని దామోదర ప్రసాద్ చెప్పారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ ‘అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. ఒకవేళ ఈ చిత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోతే ఐదు రోజుల్లో ఆరు కోట్ల గ్రాస్ వచ్చేది కాదు’ అని తెలిపారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడంలో ఓ కిక్కు ఉంటుంది. ఆ కిక్కుని నాకు ఇస్తూనే ఉన్న  ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

►ALSO READ | Spirit First Look: ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ వెనుక వంగా భారీ స్కెచ్

దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ ‘ప్రేక్షకులు మా సినిమా బాగుందని చెబుతున్నా బుక్ మై షోతో సహా రివ్యూల్లో నెగెటివిటీ చూసి బాధనిపించింది. ఫస్ట్ డే జస్ట్ 4నుంచి 4.7 రేటింగ్స్ ఇచ్చారు. సినిమా నచ్చకపోతే తప్పుల్ని ఎత్తి చూపండి.. మార్చుకుంటాం.  కానీ వెంటాడి, వేటాడినట్టుగా చేయకండి’ అని కోరారు. మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈషా సినిమాకు బుక్ మై షోలో 7.6/10 రేటింగ్ కలిగి ఉండటం గమనార్హం!